బ్రూస్ లీ ఫ్లాప్ తో జ్ఞనోదయం చూసిన రామ్ చరణ్ తన రూట్ మార్చే పనిలో పడ్డాడు.వరుస కమర్షియల్ సినిమాలతో ఒక ఇమేజ్ చట్రంలో పడిపోయిన చరణ్ ఆ ఇమేజ్ నుంచి బయటపడాలనుకుంటున్నాడు.
ఇప్పటికే తని ఒరువన్ రీమేక్, గౌతమ్ మీనన్ చిత్రాలతో క్లాస్ ఆడియెన్స్ కి చేరువయ్యే పనిలో పడ్డ చరణ్ మరో క్లాస్ సినిమాకు పచ్చజెండ ఊపలనుకుంటున్నట్లు సమాచారం.
ఇటివలే దర్శకుడు సుకుమార్ చరణ్ కోసం ఓ కథ తీసుకెళ్ళారని సినివర్గాల టాక్.
చాలా సేపు ఇద్దరు చర్చించుకున్నారట.
నాన్నకు ప్రేమతో తరువాత సుకుమార్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.
చరణ్ కూడా చాలా సార్లు సుకుమార్ తో పనిచేయాలని ఉంది అని చెప్పాడు.ఇంతకి చరణ్ ఆ సినిమా కథ ఒప్పుకున్నారా లేదా అనేది తెలియకపోయినా, చరణ్ ఆలోచనలు క్లాస్ కథల మీదే ఉండటంతో ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.