సూపర్ స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సాధించిన చిత్రం ‘శ్రీమంతుడు’.ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివతో మరో చిత్రం చేసేందుకు మహేష్‌బాబు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక అదే చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శృతిహాసన్‌కు తనతో మరోసాని హీరోయిన్‌గా నటించే అవకాశం కల్పించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం పూర్తి అవ్వగానే తమిళ క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించబోతున్నాడు.
అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఇటీవలే మురుగదాస్ చెప్పిన కథకు మహేష్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం మహేష్‌తో సినిమా కోసం మురుగదాస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.అందులో భాగంగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను మురుగదాస్ ఎంపిక చేయాలని భావించాడు.
అదే విషయాన్ని మహేష్‌బాబుకు చెప్పగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.‘శ్రీమంతుడు’ చిత్రంలో చారుశీలగా మహేష్‌బాబుతో రొమాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న శృతిహాసన్ ఈ చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.







