శ్రీమంతుడు లోని “జాగో.జాగోరే జాగో” పాట ఉందిగా.
మహేష్ బాబు చకచకా గ్రామప్రజల అవసరాలన్నీ తీర్చేస్తాడు.అచ్చుగుద్దినట్టు అలానే కాకపోయినా, అలాంటిదే జరగబోతోంది మహబూబ్ నగర్ సిద్దాపురం గ్రామంలో.
మన సూపర్ స్టార్ ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
సినిమా నడుస్తున్న సమయంలో పనులు మొదలుపెడితే పబ్లిసిటీ స్టంట్ అనుకుంటారని భావించిన మహేష్ సరిగ్గా శ్రీమంతుడు తన బిజినెస్ క్లోస్ చేసుకోగానే తన టీంను సిద్దాపురం పంపించాడు.
అక్కడికి వెళ్ళిన మహేష్ మనుషులు గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేపడుతున్నారు.వీరంతా ఓ రిపోర్ట్ తయారుచేసి మహేష్ చేతికి ఇస్తారు.
బ్రహ్మోత్సవం తాజా షెడ్యుల్ అవగానే మహేష్ ఆ గ్రామ సర్పంచితో సమావేశమవుతారని సమాచారం.ఈ చర్చల అనంతరం గ్రామంలో మహేష్ చేపట్టదలచుకున్న అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయి.
మరో వైపు, మహేష్ స్వగ్రామం అయిన బుర్రిపాలెంలో కుడా త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి.







