బీహార్ ఎన్నికల మీద అమెరికా ఆసక్తి

ఒక దేశంలో జరిగే ఎన్నికల మీద మరో దేశం ఆసక్తి చూపడం సహజం.అది కూడా సాధారణ ఎన్నికల విషయంలోనే.

 Bihar Election Pm Modi’s Biggest Electoral Test-TeluguStop.com

ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో ఉన్న ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రావడమో లేదా కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టదమో జరుగుతుంది.ఈ ఆసక్తి మీడియాకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఉంటుంది.

కానీ ఒక దేశంలోని ఒక రాష్టంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల గురించి విదేశాలు ఆసక్తి చూపుతాయా? కానీ అమెరికా ఆసక్తి చూపుతున్నది.తొందరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల మీద అమెరికాలోని మేధావులు, మీడియా నిపుణులు ఆసక్తి చూపుతున్నారు.

అక్కడి ప్రభుత్వం కూడా గమనిస్తూనే ఉంది.విదేశానికి ఎందుకింత ఆసక్తి అంటే ఈ ఎన్నికలు వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పరీక్షగా మారాయి కాబట్టి.

బీహార్ ఎన్నికలు దేశ రాజకీయాలనే కీలక మలుపు తిప్పుతాయని భావిస్తున్నారు.ఈ ఎన్నికల్లో భాజపా ఓడిపోతే నరేంద్ర మోడీ భవిషత్తు ప్రశ్నార్థకంగా మారినట్లే.

భాజపా అధికారం చేపడితే మోడీ చరిష్మా ఇంకా పనిచేస్తున్నట్లే భావించాలి.ఎందుకంటే మోడీ ఇమేజ్ తగ్గిపోతున్నట్లు ఒక మీడియా సంస్థ ఈ మధ్య జరిపిన సర్వేలో తేలింది.

నిజం చెప్పాలంటే భీహార్ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికల స్థాయిలో ఆసక్తి కలిగిస్తున్నాయి.భాజపా గెలిస్తే రాజ్య సభలో దాని బలం పెరుగుతుంది.2016, 2017 లో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద ఆశలు ఉంటాయి.అందుకే ఇది మోడీకి పరీక్ష అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube