కంచె బడ్జెట్ మరీ ఎక్కువ అయిపోయిందేమో !

సినిమా అంటే కేవలం మంచి కథ, దానికి తగ నటులను తీసుకోవడమే కాదు .గొప్ప కథలు రాసినవల్లంతా గొప్ప డైరెక్టర్స్ కాదు .

హీరో మార్కెట్, సినిమా జానర్, ఇవన్ని దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా తీసి, నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టినవాడు ఖచ్చింతంగా గొప్ప డైరెక్టర్ అవుతాడు .మారుతి రెండో కోవలోకి వస్తాడు .హీరో మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఎంత అవసరమో అంతే బడ్జెట్ పెట్టి సినిమాని హిట్ చేయడంలో మారుతి సిద్ధహస్తుడు.ఆ పనితనం డైరెక్టర్ క్రిష్ లో లేదేమో .క్రిష్ రాసుకునేవి గొప్ప కథలే.నటుడి నుంచి నటన ఎలా రాబట్టుకోవాలో క్రిష్ కి తెలుసు .కాని ప్రేక్షకుల నుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలీదేమో .అందుకే ఏ సినిమా కుడా లాభాలు తెచ్చిపెట్టింది లేదు.తాజాగా క్రిష్ తీసిన కంచె బడ్జెట్ 21 కోట్లు దాటిందట .వరుణ్ తేజ్ మార్కెట్ దీంట్లో సగం.అది కుడా మొదటి చిత్రం, శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అవడం వల్ల దాదాపు `12 కోట్లు కలెక్ట్ చేసింది ముకుంద .వరుణ్ తేజ్ సినిమాకు 21 కోట్ల బిజినెస్ ఎలా జరగాలి ? అసలే పెద్ద కమర్షియల్ మూవీ కాదు .బ్లాక్బస్టర్ టాక్ వచ్చినా అంత మొత్తం రాకపోవచ్చు.ఎటు చుసిన విడుదల కి ముందే నష్టాలు రావడం ఖాయం .ఇక సినిమా రిజల్ట్ తేడా కొడితే దేవుడే దిక్కు !.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?

తాజా వార్తలు