విజయాలను ఉన్న దానికంటే ఎక్కువ చేసి చూపించుకోవడం, వైఫల్యాలు ఎంత ఎక్కువగా ఉన్నా తక్కువ చూపించుకోవడం ప్రభుత్వాలకు అలవాటే.వైఫల్యాలు కొండంతలు ఉంటే గోరంతలు చేస్తారన్న మాట.
తెలంగాణా సర్కారు ఈ పనే చేస్తున్నాడని టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.తెలంగాణలో రైతుల ఆత్మహత్యల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
కాని ప్రభుత్వం దాన్ని చాలా తక్కువగా చూపిస్తున్నదని దయాకర్ రావు అన్నారు.జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్ సి ఆర్ బీ ) రికార్డుల్లో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంది.
అవి సరైన లెక్కలు కావని సర్కారు బుకాయిస్తున్నది.అంతమంది చనిపోలేదని చెబుతున్నది.
ఈ విధంగా చెప్పడం రైతులను అవమాన పరచినట్లే.రైతులు ఎలాంటి సమస్యలు లేకుండానే చనిపోయారా? ఏమీ తోచక ప్రాణాలు తీసుకున్నారా? ఆత్మహత్యల పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ఎండగడతామని దయాకర్ చెప్పారు.కెసీఆర్ కు రైతు ఆత్మహత్యల పట్ల బాధ లేదని, ఆయన తన ఫాం హౌస్ గురించే వర్రీ అవుతున్నారని ఎద్దేవా చేసారు.దయాకర్ అన్నట్లు అసెంబ్లీలో సర్కారును కడిగి పారేయల్సిందే.







