సినిమా నిర్మాణ దశలో ఉండగానే సెలవులకి ఆశపడి సినిమా విడుదల తేది అనౌన్స్ చేస్తే ఇలానే ఉంటది.సినిమా మొదలవకముందే దసరా బరిలో ఉంటామని ప్రకటించారు బ్రూస్ లీ దర్శకనిర్మాతలు .
గత వారం సినిమా విడుదల తేది అక్టోబర్ 16 అని ప్రకటన ఇచ్చారు.మళ్ళి దసరా మిస్ అయితే అన్ని సెలవులు సంక్రాంతి దాకా దొరకవు కదా !
ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ఒత్తిడి దర్శకుడు శ్రీనువైట్ల, హీరో రామ్ చరణ్ మీద బలంగా పడింది.
ఎలా చేసైనా సినిమా త్వరగా పూర్తీ చేసి అక్టోబర్ 16 న రావాల్సిందే అని పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారు ఇద్దరు.షూటింగ్ త్వరగా ప్యాకప్ చెప్పట్లేదట శ్రీను వైట్ల .అదనపు సమయాన్ని కుడా షూటింగ్ మీదే వెచ్చిస్తున్నాడట చరణ్.ఇది కాకుండా చిరంజీవికి సంబంధించిన సీనులు, పాట, ఫైట్ ఇంకా బాలెన్స్ ఉండనే ఉంది.
ఇంతవరకు ఐటెం భామ ఎవరో ఫిక్స్ అవకపోవడం ఇంకో విచిత్రం.
సినిమా ఆలస్యంగా మొదలుపెట్టడం ఎందుకు ? ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఎందుకు ? మళ్ళి తిండి, నిద్ర సరిగా లేక బాధపడటం ఎందుకు ? ఆదరాబాదరాగా సినిమాని చుట్టేయడం ఎందుకు ?
.






