అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే బీహార్లో రెండు కూటములు ఏర్పడ్డాయి.ముఖ్యమంత్రి నాయకత్వంలో గ్రాండ్ అలయన్సు (మహా కూటమి) ఏర్పడగా, ఈ అలయన్సు నుంచి బయటకు వెళ్ళిపోయిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి ములాయం సింగ్ యాదవ్ థర్డ్ ఫ్రంట్ (మూడో కూటమి) ఏర్పాటు చేసారు.
మహా కూటమిలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ఉండగా, మూడో కూటమిలో సమాజ్వాది, ఎన్సీపీ, సమాజ్వాది జనతాదళ్ (డీ) ఉన్నాయి.ములాయం రెండు వారాల కిందట మహా కూటమి నుంచి వెళ్ళిపోయారు.
సమాజ్వాది, ఎన్సీపీ సీట్ల బేరాలు కుదరక మహా కూటమి నుంచి వెళ్ళిపోయాయి.ఈ రెండు పార్టీలకు బీహార్లో అసలు బలం లేదు .2010 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక్క సీటు కూడా సాధించలేదు.గత పార్లమెంటు ఎన్నికల్లో ఎన్సీపీ ఒక్క సీటు సాధించగా, సమాజ్వాదీ స్కోరు సున్నా.