నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం ‘డిక్టేటర్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.శ్రీవాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌లుగా అంజలి మరియు సోనాల్ చౌహాన్‌లు నటిస్తున్నారు.
బాలయ్య కెరీర్‌లో 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ చిత్ర ఆడియోను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
ఈ సినిమా ఆడియోను నవంబర్‌లో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.నందమూరి ఫ్యాన్స్ ఇప్పటి నుండే ‘డిక్టేటర్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
భారీ అంచనాలున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో మైలు రాయి సినిమాగా నిలవడం ఖాయం అంటున్నారు.కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.







