రాష్ట్ర విభజన వారికి శాపమైంది

రాష్ట్ర విభజన రాజకీయ నాయకులకు ప్రయోజనం కలిగించింది.వారికి పదవులు వచ్చాయి.

 Ap Power Employees To Start Hunger Strike-TeluguStop.com

కాని ఎందరో ఉద్యోగులకు అన్యాయం జరిగింది.చివరకు కొందరు ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి.

ఇటువంటి వారిలో ఎపీకి చెందిన విద్యుత్ రంగ ఉద్యోగులు ఉన్నారు.వారిని తెలంగాణా ప్రభుత్వం తొలగించింది.

ఏపీ ప్రభుత్వం తీసుకోవడం లేదు.దిక్కు తోచని స్థితిలో ఉన్న వీరు చివరకు నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు.

ఏపీకి చెందిన వెయ్యి మంది విద్యుత్ ఉద్యోగులు తెలంగాణాలో పని చేస్తున్నారు.విభజన తరువాత మీరు మాకు అవసరం లేదు… ఏపీకి వెళ్ళిపొండి అని ప్రభుత్వం తొలగించింది.

తమను ఏపీ ప్రభుత్వంలోకి తీసుకోవాలని వీరు వేడుకున్నారు.కాని బాబు సర్కారు మొండి చెయ్యి చూపింది.

వీరికి జూన్ నుంచి ఉద్యోగాలు లేవు.జాతాలు లేవు.

రోడ్డున పడ్డారు.చివరకు వీరంతా వచ్చే వారం విజయవాడలో నిరాహార దీక్ష చేయబోతున్నారు.

ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇప్పటి వరకు వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదని ఉద్యోగుల నాయకులు చెప్పారు.వాస్తవంగా వీరిని ఏపీ ప్రభుత్వం తీసుకోవాలి.

కాని నిరాకరిస్తున్నది.వీరు పస్తులు ఉండాలా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube