కథానాయిక ఏం చేయాలి ? దర్శకుడు చెప్పిన టైం కి షూటింగ్ కి బయలుదేరి, నటించడం వచ్చినా రాకున్న నటించినట్టు నటించి, కారవాన్ లో భోజనం, మేకప్ చేసుకోని, ఓ కునుకు తీసి, దర్శకుడు ప్యాకప్ చెప్పగానే ఇంటికి వెళ్లిపోవాలి.సినిమా దగ్గర పడ్డాకా మీడియాతో ఇంతలా కష్టపడ్డాం, అంతలా పనిచేశాం అంటూ కబుర్లు చెప్పాలి.
అంతే కాని తమకు సంబంధం లేని విషయాల్లో తల దూరిస్తే ఎలా .సరే పౌరిరాలి గా బాధ్యత ఉంది అనుకుందాం .విషయం పూర్తిగా తెలిస్తే, దానిపైన సరైన అవగాహన ఉంటే కదా స్పందించాలి.
అవన్నీ మాకు తెలియవు, ట్విట్టర్ ఉంది, లక్షల మంది మమ్మల్ని ఫాలో అవుతున్నారు, మా ఇష్టం అన్నట్టు ఉంది కథానాయికల వ్యవహారం.
సోనమ్ కపూర్, సోనక్షి సిన్హా, ఇప్పుడు మళ్ళి తాప్సీ … మహారాష్ట్ర ప్రభుత్వం మాంసాహారం పై విధించిన బ్యాన్ పై ప్రతిపక్షాల తీరులో విరుచుకుపడుతున్నారు.తాప్సీ ట్వీట్స్ ఓ మాదిరిగా ఉన్నాయి కాని, సోనమ్, సోనాక్షి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
సినిమాలు లేక ఖాలిగా ఉంటున్న తాప్సీ టైంపాస్ చేసిన ఓ అర్థం .సోనమ్, సోనాక్షిలకి ఏం అవసరం అని తిట్టుకుంటున్నారు సగటు ట్విట్టర్ వినియోగదారులు.







