టీడీపీని వదలను...కెసీఆర్నూ వదలను

ఈ ఇద్దరినీ వదలని నాయకుడు తెలంగాణా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.ఆయన టీడీపీని వదిలి పెడుతున్నట్లుగా వార్తలు వచ్చాయట.

 I Will Not Rest Till I Expose Kcr’s Corruption-TeluguStop.com

దీనిపై రేవంత్ మండిపడ్డారు.తను టీడీపీని వదిలి పెడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు.

తను టీడీపీని వదలనని, అలాగే ముఖ్యమంత్రి కెసీఆర్ని కూడా వదిలి పెట్టబోనని స్పష్టం చేసారు.ఆయన అవినీతిని బయట పెట్టేవరకు తనకు రెస్టు లేదన్నారు.

ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులపై అసెంబ్లీలో నిలదీస్తానని చెప్పారు.విచారణ ప్రక్రియలో రేవంత్ పాలు పంచుకోవలసిన అవసరం లేదని, తాము పిలిచేదాకా కోర్టుకు రావలసిన అవసరం లేదని ఏసీబీ కోర్టు పేర్కొంది.

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు తొందరలో ప్రారంభం కాబోతున్నాయి.ఇప్పటివరకు హైకోర్ట్ ఆంక్షల కారణంగా సొంత నియోజకవర్గమైన కోడంగల్లో ఉంటున్న రేవంత్ కు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇస్తారేమో.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube