‘మేము సైతం’ కార్యక్రమంలో స్టేజ్‌పై రెండు పాటలు పాడి అందరిని ఆశ్చర్యపర్చడమే కాకుండా ఆకట్టుకున్నాడు నందమూరి హీరో బాలయ్య.తన ఎనర్జిటిక్ ఫర్‌ఫార్మెన్స్‌తో తోటి హీరోలకు సైతం ఊపు తెప్పించాడు.
బాలయ్య పాడిన ఆ రెండు పాటలు సోషల్ మీడియాలో ఎంతగా హల్ చల్ చేసాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బాలయ్యలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా అంటూ ఆయన అభిమానులు సైతం అవాక్కయ్యారు.
తాజాగా మరోసారి బాలయ్య బాబు తన గొంతు సవరించాడు.ఈసారి తనతో పాటు తన సహ నటుడు వెంకటేష్ కూడా పాట పాడేలా చేశాడు.
ప్రముఖ గాయని ఉషా ఉతువ్ ఒక హుషారైన పాట పాడుతున్న సమయంలో ఆమెతో పాటు బాలయ్య గొంతు కలిపాడు.ఆ తర్వాత వెంకటేష్ కూడా ఆమెతో కలిసి పాడాడు.
దాంతో కార్యక్రమం అదిరి పోయింది.ఇద్దరు స్టార్ హీరోలు గొంతు కలపడంతో ఈ పాట కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచింది.
రెండు రోజులు వైభవంగా దుబాయ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.పలువురు హీరోయిన్స్ తమ డాన్స్‌లతో అదరగొట్టారు.
త్వరలో ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రసారం అయ్యే అవకాశం ఉంది.







