ఆగ్రహం' రువ్వే రోజావే...!

‘రోజావే…చిన్ని రోజావే…రాగాలే రువ్వే రోజావే’…అనే సున్నితమైన పాట మాజీ హీరోయిన్‌, ఏపీకి చెందిన ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రోజాకు వర్తించదు.టీవీ షోలల్లో నవ్వుతూ ఉండే రోజా, రాజకీయ నాయకురాలిగా మాత్రం నిప్పులు కక్కుతుంటారు.

 Chandrababu’s Government Has Been Ignoring Common People’s Issues-TeluguStop.com

ఎవరి మీద? ఇంకెవరి మీద? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీదనే.టీడీపీలో ఉన్నప్పుడు ‘ఫైర్‌ బ్రాండ్‌’గా ముద్ర పడిన రోజా ఇప్పటికీ అలాగే ఉన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె వీరంగం చూసిన వారు ఇప్పటికీ దాన్ని మర్చిపోలేకుండా ఉన్నారు.మనిషి అందంగా ఉంటారు గాని నోరు అందుకు విరుద్ధంగా ఉంటుంది.టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుతో ప్రశంసలు పొందిన రోజా ఇప్పుడు ఆయనపై ‘బూతుల పంచాగం’ చదువుతున్నారు.తాజాగా ఆమె బాబుపై తీవ్రంగా ఆగ్రహించారు.

వాగ్దానాలు విస్మరించారని మండిపడ్డారు.ప్రధానంగా డ్వాక్రా మహిళలకు, అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.

బాబు వారిని విస్మరించారని అన్నారు.మద్యం షాపులను (బెల్టు షాపులు) మూయిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మద్యం వ్యాపారాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తాజాగా టీడీపీ ఎంపీలపై చేసిన విమర్శలను గుర్తు చేశారు.బాబును విమర్శించడం బాగానే ఉందిగాని వైఎస్సార్‌సీపీలో రోజా పనితీరు ఏమీ బాగాలేదని వార్తలు వస్తున్నాయి.

ఆ పార్టీ మహిళా సంఘం బాధ్యతలు రోజాయే చూస్తున్నారు.అయితే ఆమె నామమాత్రంగా పనిచేస్తున్నారట…! ఎదుటివారిని విమర్శించడంతో పాటు సొంత పార్టీలోనూ అంకితభావంతో పనిచేయాలి మరి…!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube