స్పీకర్‌ను ఆకట్టుకున్న మాటకారి కూతురు....!

ఏమాటకామాటే చెప్పుకోవాలి.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన, తెర వెనక రాజకీయాలు ఎలా ఉన్నా మంచి మాటకారి అనడంలో సందేహంలేదు.

 Kavitha Is Good Leader Says Lok Sabha Speaker-TeluguStop.com

సామాన్య జనం మొదలు కాకలుతీరిన నాయకుల వరకు ఆకట్టుకునేలా, ఆకర్షించేలా మాట్లాడటంలో ఆయన అందెవేసిన చేయి.ఆయన ప్రసంగాలకు ఆంధ్రాలోనూ చాలామంది అభిమానులు ఉన్నారనడం అతిశయోక్తి కాదు.

ఎదుటివారిని తిట్టడం అనే బలహీనత కారణంగా ఆయనకు చెడ్డ పేరు వస్తోంది.ఇక ఆయన కూతురు, నిజామాబాద్‌ ఎంపీ కవిత, కుమారుడు, ఐటీ అండ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా ‘మాటల మరాఠీ’లే.

మేనల్లుడు, నీటిపారుదల శాఖ మంత్రి అయిన హరీష్‌రావు కూడా ఇదే టైపు.కవితకు మాటలతో ఆకట్టుకునే గుణం బాగా ఉంది.

ప్రసన్నంగా ఉంటూనే పదునైన మాటల తూటాలు వదులుతుంది.పార్లమెంటులోనూ ఆమె మాట్లాడిన తీరు అన్ని పార్టీల సభ్యలనూ ఆకట్టుకుంది.

బాగా మాట్లాడిందని అందరూ మెచ్చుకున్నారు.తాజాగా లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కవితను ప్రశంసించారు.

ఆమె మంచి మాటకారే కాకుండా మంచి నాయకురాలని పొగిడారు కూడా.తమతో కలిసి (పార్లమెంటు సభ్యుల బృందం) యూరప్‌కు వచ్చిన కవిత అక్కడ చక్కగా మాట్లాడారని అన్నారు.

మాటకారితనమనేది తండ్రిని చూసి నేర్చుకున్నదా, పుట్టుకతోనే వచ్చిందా అని చెప్పలంగాని తండ్రికి తగిన కూతురని నిరూపించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube