పాలకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తాను అని జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పిన పవన్ కళ్యాణ్ చాలా కాలం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారు.ఈ వైఖరిపై అనేక విమర్శలు రావడంతో చివరకు సోమవారం మీడియా ముందుకు వచ్చి అనేక సంగతులు మాట్లాడారు.
తెలంగా ఆంధ్రా పాలకులను విమర్శించారు.పేర్లు పెట్టి మరీ విమర్శలు చేశారు.
కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వదల్లేదు.ఆంధ్రాకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుండా దిక్కులేని రాష్ర్టంగా చేసిందన్నారు.యూపీఏ, ఎన్‌డీఏ రెండూ కలిసి ఉమ్మడి రాష్ర్టాన్ని విడదీశాయని దుయ్యబట్టారు.
విభజన తరువాత తెలంగాణ ఆనందంగా ఉందని, ఆంధ్రా కష్టాల పాలవుతోందని అన్నారు.విబజన చట్టంలోని సెక్షన్ ఎనిమిదిని తాను సమర్ధించడంలేదన్నారు.
తెలంగాణలోని ఆంధ్రులను సెటిలర్లని, ఆంధ్రోళ్లని విమర్శించవద్దని హితవు చెప్పారు.రేవంత్ రెడ్డి కేసును కోర్టు చూసుకుంటుందని అన్నారు.
చంద్రబాబు ఫోన్లను ట్యాప్ చేయడం తప్పని అన్నారు.తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రకు చెందిన ఆనందసాయిని చీఫ్ ఆర్కిటెక్టర్‌గా నియమించడాన్ని హర్షిస్తూ కేసీఆర్ తెలుగు జాతి ఐక్యతకు తొలి అడుగు వేశారని ప్రశసించారు.
ఆయన కేసీఆర్‌ను ప్రశంసించడం ఇదే మొదటిసారి.మొత్తం మీద ఎవ్వరిపై మొగ్గు చూపకుండా అందరినీ విమర్శంచారు.
ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడటం లేదని ఆంధ్రా ఎంపీలను నిలదీశారు.ఈ విషయంలో తెలంగాణ నాయకులను చూసి నేర్చుకోవాలన్నారు.
పవన్ వ్యాఖ్యలపై వివిధ నాయకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.







