సహాయ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హీరోగా మారి తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాని.స్వయం కృషితో ఎదిగిన కొద్ది మంది హీరోల్లో నాని ఒకడు అంటే అందులో ఏమాత్రం అతి శయోక్తి లేదు.
ఇక ఈయన నటనకు సినిమా సినిమాకు మార్కులు పెరుగుతూనే ఉన్నాయి.ఇప్పటికే ఈయన పలు సక్సెస్ సినిమాలో నటించాడు, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం రెండు సినిమాల్లో నాని నటిస్తున్నాడు.నానికున్న క్రేజ్ దృష్ట్యా పలువురు చిన్న నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూలు కడుతున్నారు.
అయితే నాని సినిమాలు ఒప్పుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
వచ్చిన ప్రతి ఆఫర్‌కు ఓకే చెప్పకుండా, దర్శకుడు ఎలాంటి వాడు, ఆయన ట్రాక్ రికార్డు ఏంటి అనే విషయాలను పరిశీలిస్తున్నాడు.
ఇక మరీ ముఖ్యంగా నిర్మాత సినిమాను అనుకున్నట్లుగా నిర్మించి విడుదల చేయగలడా అనే విషయాన్నికూడా చూస్తున్నాడు.గతంలో నాని నటించిన రెండు సినిమాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
దాంతో పెద్ద నిర్మాణ సంస్థలతోనే నాని సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ సినిమాలను ఒప్పుకోవడం లేదు.ప్రస్తుతం నాని గీతాఆర్ట్‌లో ‘భలేభలే మగాడివోయ్’ సినిమాలో నటిస్తున్నాడు.
తాజాగా మరో కొత్త సినిమాను పెద్ద బ్యానర్‌లో చేసేందుకు ఒప్పుకున్నాడు.ఇక నాని ప్రస్తుతం తన ఒక్కో సినిమాకు 2.5 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు సినీ వర్గాల వారు చెబుతున్నారు
.







