ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ న్యూ జెర్సీలో కన్నుమూసింది.గత కొంత కాలంగా శ్వాస సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఆర్తిఅగర్వాల్ చికిత్స పొందుతూ గుండె పోటు రావడంతో తుది శ్వాస విడిచింది.
తెలుగులో ఈమె ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈమె కెరీర్‌లో వెను దిరిగి చూసింది లేదు.
ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్.
ఇలా టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె సినిమాలు చేసింది.ఈమె నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఈమె రెండు సార్లు కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య యత్నం చేసింది.2007లో ఈమె వివాహం చేసుకుంది.పెళ్లి తర్వాత కూడా ఈమె పలు సినిమాల్లో నటించింది.అయితే గత కొంత కాలంగా ఈమెకు పెద్దగా సక్సెస్‌లు రాలేదు.దాంతో ఈమె ఫేడ్ అవుట్ అవుతూ వచ్చింది.ఈమె చెల్లెలు అతిథి అగర్వాల్ కూడా తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఆర్తి అగర్వాల్ చినిపోయిన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో విషాదాన్ని నింపింది.ఆమె మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.







