టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లుగా గత రెండు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్న చిత్రాలు ‘బాహుబలి’ మరియు ‘రుద్రమదేవి’.ఈ రెండు సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరోటి ఉంటాయని, ఒకదానికి మరోటి తీవ్ర పోటీ ఇవ్వడం ఖాయం అంటూ ప్రచారం జరిగింది.
అయితే విడుదల సమయం వచ్చే వరకు ‘బాహుబలి’ ముందు ‘రుద్రమదేవి’ నిలువలేక పోయింది.‘బాహుబలి’ దాదాపు 225 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కడంతో పాటు, అందులో స్టార్ క్యాస్టింగ్ భారీగా ఉంది.
ఇక ‘రుద్రమదేవి’ విషయానికి వస్తే ఈ సినిమా బడ్జెట్ 65 కోట్లు మాత్రమే.ఈ సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం.
ఈ రెండు సినిమాలను కూడా ప్రేక్షకులు పోల్చి చూడవద్దని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.దేని గొప్పదనం దానిదేగా ప్రేక్షకులు భావించాలని అంటున్నారు.
‘బాహుబలి’ అంత గొప్పగా ‘రుద్రమదేవి’ సినిమా లేదనే వాదనను తీసుకు రావద్దని, ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు ఒక్కటి రెండు మాత్రమే వస్తాయి.అన్ని అలాగే ఉండాలి అంటే కష్టం.
అందుకే ‘రుద్రమదేవి’ సినిమాను ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా, దేనితో పోల్చకుండా చూడాలని ప్రేక్షకులకు సలహా ఇస్తున్నారు.ఇంత చెబుతున్నా కూడా ‘బాహుబలి’ ట్రైలర్‌ను చూసిన ఆ కళ్లు ‘రుద్రమదేవి’ సినిమాను మెచ్చుకుంటాయో చూడాలి.








