మెగాస్టార్‌ రాలేదుగా..!

స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ ఆడియో నిన్న విడుదలైంది.ఈ ఆడియో విడుదల కార్యక్రమంకు మెగాస్టార్‌ చిరంజీవి హాజరు కాబోతున్నారు అంటూ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.

 Chiranjeevi Not Attend For Jyothi Lakshmi Audio Launch-TeluguStop.com

చిరంజీవి 150వ సినిమాను పూరి చేయబోతున్నాడు కనుక ఆ అనుబంధంతో చిరు ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చే అవకాశాలున్నాయి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే అవన్ని ఒట్టి గాలి వార్తలే అని తేలిపోయింది.

ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కు చిరు రాలేదు.చిరు కాకున్నా కనీసం మెగా ఫ్యామిలీ నుండి ఏ ఒక్కరు కూడా రాలేదు.

ఛార్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను పూరి జగన్నాధ్‌ కేవలం రెండు నెలల్లో పూర్తి చేశాడు.ఈ సినిమా కథను తాను ఎప్పటి నుండో తెరకెక్కించాలని భావిస్తున్నాను అని, అయితే అది ఇప్పటికి తీరిందని పూరి చెప్పుకొచ్చాడు.

ఆరు సంవత్సరాల క్రితం ఈ సినిమా కథను ఛార్మికి చెప్పడం జరిగింది.ఛార్మి మాత్రమే ఈ కథకు సూట్‌ అవుతుందని భావించి, ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఆమెనే హీరోయిన్‌గా పెట్టి ఈ సినిమా చేశాను అంటూ పూరి చెప్పుకొచ్చాడు.

ఈనెల 12న విడుదల కాబోతున్న ఈ సినిమాను సి.కళ్యాణ్‌తో కలిసి హీరోయిన్‌ ఛార్మి నిర్మించింది.ఛార్మి తొలిసారిగా నిర్మించిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube