ఎనర్జిటిక్ హీరో రామ్ చాలా కాలంగా సక్సెస్‌కు దూరంగా ఉన్నాడు.ఈయన నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.
దాంతో కసితో నటించిన చిత్రం ‘పండుగ చేస్కో’.ఈ సినిమాకు ‘బలుపు’ చిత్రంతో బ్లాక్ బస్టర్‌ను కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో రామ్ ఉన్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ నటించింది.
ఈమె నటించిన ఎక్కువ సినిమాలు సక్సెస్ అవ్వడంతో ఈమెకు లక్కీ గర్ల్ అనే పేరు వచ్చింది.ఆ లక్కీ తనకు కూడా కలిసి వస్తుందేమో అని రామ్ భావిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.ఇక సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకే ప్రమోషన్స్‌లో ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు.ప్రస్తుతం రామ్ ఆశలన్నీ కూడా రకుల్ ప్రీత్ సింగ్‌పైనే ఉన్నాయి.
ఈ సినిమా తప్పకుండా రామ్‌కు విజయం కావాల్సిన అవసరం ఉంది.ఈ సినిమాతోనే రామ్ కెరీర్ ఆధారపడి ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ ఈ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.







