ఇంకెప్పుడు ప్రేమతో నాన్నకు?

ఇతర హీరోల్లా కాకుండా సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసే రకం ఎన్టీఆర్‌.ఒక సినిమా చేస్తుండగానే మరో సినిమాకు కమిట్‌ అయ్యి, ఒక సినిమా పూర్తి అవ్వగానే మరో సినిమాను మొదలు పెడుతూ ఉంటాడు.

 Delay Continues In Ntr – Sukumar Movie Launch-TeluguStop.com

అయితే ఈసారి ఎన్టీఆర్‌ ప్లాన్‌ అంతా మార్చేశాడు దర్శకుడు సుకుమార్‌.‘టెంపర్‌’ సినిమా పూర్తి అయ్యి, విడుదల అయిన వెంటనే సుకుమార్‌ దర్శకత్వంలో నటించాల్సి ఉంది.

‘టెంపర్‌’ విడుదలకు ముందే సుకుమార్‌ స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లుగా వార్తలు వచ్చాయి.వెంటనే షూటింగ్‌ ప్రారంభిస్తారని భావించిన ఎన్టీఆర్‌ కొత్త సినిమా ఇప్పటి వరకు ప్రారంభం అయ్యింది లేదు.

‘టెంపర్‌’తో చాలా కాలం తర్వాత సక్సెస్‌ కొట్టిన ఎన్టీఆర్‌ సక్సెస్‌ జోష్‌లో వెంటనే మరో సినిమా చేయాలని భావించాడు.అయితే సుకుమార్‌కు బుక్‌ అవ్వడంతో ముందుకు వెళ్లలేక, వెనుక ఉండలేక ఎన్టీఆర్‌ నానా ఇబ్బందులు పడుతున్నాడు.

ఈ సినిమాను రెండు నెలల క్రితం ప్రారంభిస్తాను అంటూ చెప్పిన సుకుమార్‌ పలు కారణాలు చెబుతూ వాయిదా వేస్తున్నాడు.తాజాగా కూడా ఈనెలాఖరున ఈ సినిమాను యూరప్‌లో ప్రారంభించబోతున్నట్లుగా సుకుమార్‌ ప్రకటించాడు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలాఖరున కూడా ఈ సినిమా ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు.ఈ సినిమాకు సుకుమార్‌ ‘ప్రేమతో నాన్నకు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాలో నాన్నగా జగపతిబాబు నటించే అవకాశాలున్నాయి.నందమూరి ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube