టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరున్న బెల్లంకొండ సురేష్ తన కొడుకు సాయి శ్రీనివాస్‌ను భారీగా ‘అల్లుడు శీను’ సినిమాతో లాంచ్ చేసిన విషయం తెల్సిందే.వినాయక్ దర్శకత్వంలో తన తొలి సినిమా చేయడంతో మొదటి సినిమాతోనే బెల్లంకొండ కుర్రాడికి మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత వెంటనే మరో యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చింది.అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా ప్రారంభం కాకుండానే క్యాన్సిల్ అయ్యింది.
ప్రస్తుతం ఈ కుర్రాడు భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.రెండవ సినిమా సెట్స్ పై ఉండగానే మూడవ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల నిర్మాతగా అల్లుడు శీను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాతో రాపర్తి రమేష్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
చంటి అడ్డాల ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాడు.ప్రస్తుతం రమేష్ స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది.
జులై మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇక భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ అయితే అల్లుడు శీను దశ తిరిగినట్లే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.







