హైకోర్టు రెండోసారి సీరియస్‌

తెలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న ఆర్‌టీసీ సమ్మెపై హైకోర్టు మరోసారి సీరియస్‌ అయింది.వెంటనే సమ్మె మానాలని ఆదేశించింది.

 High Court Orders Rtc Unions To Call Off Strike-TeluguStop.com

మూడు రోజుల క్రితం కూడా సమ్మె మానుకొని విధుల్లో చేరాలని ఆదేశించినా కార్మికులు ఖాతరు చేయలేదు.సమ్మె చట్ట వ్యతిరేకమని హైకోర్టు హూంకరించినా కార్మికులు లైట్‌గా తీసుకున్నారు.

సమ్మె చేయడం చట్టపరంగా తమకు ఉన్న హక్కని అన్నారు.మంగళవారం సమ్మె ఏడో రోజు కూడా కొనసాగేసరికి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

వెంటనే సమ్మె మాని విధుల్లో చేరకపోతే చర్యలు తీసుకోవల్సివస్తుందని కూడా హెచ్చరించింది.అయితే కార్మికులు సహజంగానే ఈ హెచ్చరికలను పట్టించుకోరు.

ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది.పనిలో పనిగా సాధ్యమైనంత త్వరగా అంటే రెండు వారాల్లోగా ఆర్‌టిసిని విభజించాలని కూడా ప్రభుత్వాలను ఆదేశించింది.

నలభైమూడు శాతం ఫిట్‌మెంట్‌ ప్రభుత్వాలకు భారంగా పరిణమిచింది.తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందేమోగాని ఆంధ్ర ప్రభుత్వానికి అంత శక్తి లేదు.

గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం నలభైమూడు శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన కారణంగానే ఏపీ ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి వచ్చింది.ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆర్‌టీసీ కార్మికుల డిమాండ్లకు ఓకే అంటే ఏపీ ప్రభుత్వానికి తిప్పలే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube