ఆపర్లు రావడం లేదని పెళ్లికి సిద్దం అయిన త్రిషకు వరుసగా అటు తమిళం మరియు ఇటు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి.దాంతో పెళ్లిని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లుగా ఉంది.
నిశ్చితార్థం అయ్యి చాలా నెలుల అయినా కూడా ఇప్పటి వరకు పెళ్లి ఊసే ఎత్తడం లేదు.మీడియా వారు పెళ్లి గురించి ఆమె వద్ద ప్రస్థావించినా కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు.
పెళ్లి విషయం అటుంచితే ఈ అమ్మడు త్వరలో తమిళంలో శింబు హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమాలో ఈమె శింబుతో పలు లిప్ లాక్ సీన్స్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
గతంలో శింబుతో లిప్‌లాక్ చేసిన త్రిష మరోసారి కొత్త సినిమా కోసం లిప్‌లాక్ చేస్తుందనే వార్త మీడియాలో రావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయిలో వస్తున్నాయి.అయితే ఆ వార్తలు పుకార్లు మాత్రమే అంటూ త్రిష కొట్టి పారేసింది.
తాను శింబుతో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం నిజమే కాని, ఆ సినిమాలో లిప్‌లాక్ సీన్ ఉన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.ఇక ఈమె త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘లయన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కమల్ హీరోగా తెరకెక్కబోతున్న కొత్త సినిమా ‘ఓర్ ఇరవు’లో హీరోయిన్‌గా నటించబోతుంది.







