నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘లయన్’.సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణరావు ఈ సినిమాను నిర్మించాడు.
ఈ సినిమా ఫిబ్రవరిలోనే విడుదల అవ్వనుందని ప్రారంభ సమయంలో చెప్పారు.అయితే ఎమ్మెల్యే అయిన బాలయ్య బిజీ షెడ్యూల్ వల్ల సినిమా ఆలస్యం అయ్యింది.
ఎట్టకేలకు ఈ సినిమాను మే 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దర్శకుడు సత్యదేవ ప్రకటించాడు.అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా వాయిదా పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా వాయిదా వెనుక కారణం మరియు ఎప్పుడు ఈ సినిమా విడుదల అయ్యే విషయాలను రేపు నిర్మాత మీడియాకు చెప్పేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు.
ఈ సినిమా డీటీఎస్ పనులు ఆలస్యం అవ్వడం వల్లే విడుదల వాయిదా పడ్డట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.రేపు నిర్మాత అదే విషయాన్ని చెప్పే అవకాశాలున్నాయి.
బాలయ్య హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష మరియు రాధిక ఆప్టేలు హీరోయిన్‌లుగా నటించారు.ఇప్పటికే విడుదలైన ఆడియో మరియు ట్రైలర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.
నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా సక్సెస్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.







