క్లారిటీ ఇచ్చిన జక్కన్న

తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ, హిందీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బాహుబలి’.జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 15న విడుదల అవుతుందని అంతా ఎదురు చూస్తున్నారు.

 Rajamouli Announces Baahubali Release Date-TeluguStop.com

కొన్ని నెలల ముందు రాజమౌళి మేలో ‘బాహుబలి’ని విడుదల చేస్తామని ప్రకటించాడు.అయితే గత కొన్ని వారాలుగా ఈ సినిమా జులైకు వాయిదా పడబోతుందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించక పోవడంతో ప్రేక్షకులు మే కోసం ఎదురు చూస్తూ వచ్చారు.అయితే తాజాగా జక్కన్న ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వీడియోను రాజమౌళి విడుదల చేయడం జరిగింది.గ్రాఫిక్స్‌ వర్క్‌ ఆలస్యమే సినిమా వాయిదాకు కారణం అన్నట్లుగా జక్కన్న చెప్పుకొచ్చాడు.

జులైలో తప్పకుండా ఈ సినిమాను విడుదల చేస్తాను అంటూ జక్కన్న పేర్కొన్నాడు.మే 31న ట్రైలర్‌ను విడుదల చేస్తాము అన్నాడు.

మాట తప్పకుండా మే 31న ట్రైలర్‌ను జులైలో సినిమాను విడుదల చేసి తీరుతాం అని జక్కన్న చెప్పుకొచ్చాడు.జూన్‌లో ఆడియో విడుదల అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్‌ దేవినేనిలు నిర్మిస్తున్నారు.ప్రభాస్‌ హీరోగా అనుష్క మరియు తమన్నాలు హీరోయిన్‌లుగా నటించారు.

కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube