తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చాలాకాలం తరువాత మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్నారు.కోదండరామ్ ముఖ్యమంత్రిని కలుసుకోవడం మీడియాకు వార్తే.
తెలంగాణ ఉద్యమంలో మొదట్లో ఇద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఉన్నప్పటికీ అది క్రమంగా బలహీనపడింది.తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తరువాత సారథి ఎవరంటే కోదండరామ్ పేరే చెప్పేవారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కోదండరామ్‌కు ప్రభుత్వంలో కీలక పదవి దొరుకుతుందని కొందరు అనుకున్నారు.కాని ప్రమాణస్వీకారానికే పిలవలేదని వార్తలు వచ్చాయి.
ఇప్పటికీ పొలిలిటకల్ జేఏసీ ఛైర్మన్‌గానే ఉన్న కోదండరామ్ కేసీఆర్ విధానాలను కొన్నింటిని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.కొన్నిసార్లు పబ్లిగ్గానే కేసీఆర్‌కు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేశారు కూడా.
దీంతో కేసీఆర్ ఈ ప్రొఫెసర్‌తో అంటీముట్టనట్లుగానే ఉన్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే కోదండరామ్ తన కుమారుడి పెళ్లికి కేసీఆర్‌ను ఆహ్వానించేందుకుగాను ఆయన్ని కలుసుకున్నారు.
ఇద్దరూ ఓ గంటసేపు ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారట కూడా.సరే ఎంత ఇష్టం లేకపోయినా కలిసినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటారు.
రాజకీయ జీవితంలో ఇవన్నీ సహజమే కదా…!







