టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.మే మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తామని సినిమా ప్రారంభం సమయంలో దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చాడు.
అయితే షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమాను జులైలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 75 శాతం పూర్తి అయ్యింది.
ఈ సమయంలో మరో కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే.
మరో హీరోయిన్ కోసం ఎంతో మందిని పరిశీలించి చివరకు బెంగాళీ బ్యూటీ అంగనా రాయ్‌ని ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.షూటింగ్ పూర్తి కావస్తున్న సమయంలో కొత్త హీరోయిన్ ఏంటి అంటూ ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు అంటున్నారు.
స్క్రిప్ట్‌లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా లేక చిన్న పాత్ర అవ్వడం వల్ల సెకండ్ హీరోయిన్‌ను ఇప్పుడు ఎంపిక చేశారా అనేది తెలియాల్సి ఉంది.ఈ సినిమాలో మహేష్‌బాబుకు తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు.
మైత్రి మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.







