జయసుధకు సూపర్‌ మద్దతు

మా అధ్యక్ష ఎన్నికల్లో సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ మద్దతును జయసుధకు ఇస్తున్నట్లుగా ప్రకటించారు కృష్ణ.తాజాగా కృష్ణను నరేష్‌ ఆధ్వర్యంలో కలిసిన జయసుధ ఆయన మద్దతు కోరడం జరిగింది.

 Super Star Krishna’s Family Supports Jayasudha’s Panel-TeluguStop.com

అందుకు ఆయన మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ అభివృద్దికి జయసుధ పాటు పడుతుంది అనే నమ్మకం తనకు ఉందని, అందుకే ఆమెకు మద్దతు ఇచ్చేందుకు సిద్దం అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు.ఇప్పటికే పలువురు స్టార్స్‌ మరియు సినీ ప్రముఖులు జయసుధకు మద్దతు తెలిపిన విషయం తెల్సిందే.

తాజాగా కృష్ణ అండ్‌ ఫ్యామిలీ మద్దతు కూడా రావడంతో ఈమె బలం మరింతగా పెరిగినట్లు అయ్యింది.

ప్రస్తుత మా అధ్యక్షుడు మురళి మోహన్‌తో పాటు కృష్ణంరాజు, సీనియర్‌ నరేష్‌ ఇంకా పలువురు నటీనటులు జయసుధ వెనుక ఉన్నారు.

దాంతో జయసుధ తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.ఇక జయసుధ ప్యానల్‌ సభ్యులు కూడా బలంగానే ఉన్నారు.

దాంతో అధ్యక్షురాలిగా ఎన్నిక కావడంతో పాటు ఆమె సొంత ప్యానల్‌ మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.రేపు ఎన్నికల నేపథ్యంలో ప్రచారం మరింత ముమ్మరంగా సాగుతోంది.

మరోవైపు వ్యక్తిగత దూషణలు మరియు విమర్శలు, ప్రతివిమర్శలు తారా స్థాయిలో వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube