నందమూరి బాలకృష్ణ తాజా సినిమా ‘లయన్’.ఈ సినిమా టైటిల్ వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే.
ఇప్పటికే ఒక నిర్మాత ఈ టైటిల్ నాది అని, తాను అదే టైటిల్‌తో సినిమాను నిర్మిస్తున్న సమయంలో బాలకృష్ణతో సత్యదేవ్ ‘లయన్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటూ ఆ నిర్మాత ఆరోపిస్తున్నాడు.ఆ నిర్మాత ఆరోపణలను పట్టించుకోకుండా సత్యదేవ్ తాను తెరకెక్కిస్తున్న సినిమాకు ‘లయన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయడం జరిగింది.
అయితే ‘లయన్’కు ముందు ఎన్‌బికేను యాడ్ చేయాలని నిర్ణయించారు.అయితే ఆ ఎన్‌బికేను చిన్న అక్షరాలతో చూపిస్తూ ‘లయన్’ను మాత్రం పెద్దగా చూపుతున్నారు.
దాంతో సదరు నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
బాలకృష్ణ, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
త్వరలోనే విడుదల అయ్యేందుకు సిద్దం అవుతున్న ఈ సినిమాపై చర్యలు తీసుకోవాలంటూ ఆ నిర్మాత ఫిల్మ్ చాంబర్‌లో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.సినిమా విడుదల ముందు ఈ వివాదం తీవ్ర తరం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఈ వివాదంపై బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.బాలయ్య స్పందిస్తే తప్ప ఈ వివాదం పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు.
అందుకే నందమూరి ఫ్యాన్స్ ఈ వివాదంను పరిష్కరించాలంటూ బాలయ్యను కోరుతున్నారు.







