ఆర్టీవో చెక్ పోస్టుల పై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడానికి రంగంసిద్దం చేసుకుని మంగళవారం భారి ఎత్తున దాడులు నిర్వహించింది.అనంతపురం జిల్లా పెనుగొండ , నెల్లూరు జిల్లా బీవి పాళెం , చిత్తూరు జిల్లా రేణిగుంట, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చెక్ పోస్టులపై ఒకేసారి అవినీతి నిరోధక శాఖ అధికార్లు దాడులు చేసారు.
పెద్ద ఎత్తున అక్రమంగా ఆర్జించిన డబ్బు వేళల్లో స్వాధీనం చేసుకున్నారు అనధికారంగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వారిని అదుపులోకి తీసు కున్నారు.ఈ చెక్ పోస్టుల్లో ఉన్న అటెండర్ నుంచి గేటు ఎత్తి దిన్చేవారు సయితం చేతులు చాచడం తో ప్రతి ఒక్కరు కోట్లాది పతులయ్యారు.
చెక్ పోస్టు గుమస్తాలంతా కోట్లు ఆస్తులు సంపాదించుకున్నారు ఇవన్ని జగమెరిగిన సత్యాలే .







