నేను పార్టి మారిపోయి ఉన్న కాంగ్రెస్ ను వదిలేసి టిడిపి లోకి పదవుల కోసమే వెళ్లాను.ఇది నేను కాదన్నా, నిజం నిజమే కదా అని టిడిపి ఎమ్ పి జే సి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
నేను సాద్యమైనంత వరకు నిజాలే మాట్లాడుతుంటాను.కెసిఆర్ కు చెల్లుబాటు అవుతుంది కనుక అనేకానేక హామీలు దంచేస్తున్నాడు ఆవెంటనే అమలు చేసేస్తున్నాడు .అదే ఆంద్ర ప్రదేశ్ ను చూసుకుంటే చంద్రబాబు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు.ఇదే విషయాన్ని బాబుకు చెప్పక చెప్పాను.
ఎలాంటి కొత్త హామీలు ఇవ్వవద్దు.ప్రత్యెక హోదా సాధించడానికి కాలమంత సరిపోతుంది .లోగడ ఇచ్చిన హామీలే చెల్లుబాటు చేయాలి .జగన్ ప్రతిపక్షమ్ లో బాగా రాణిస్తున్నాడు అని కితాబు జేసి ఇచ్చారు.జేసి సంచలన వ్యాఖ్యలకు టిడిపి నేతలు పెదాలు విరిచారు .నాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ పార్టీని తూర్పార పట్టేవారు .ఆయన తీరే అంత అని అనుకోక తప్పలేదు అని టిడిపి నేతలు గుసగుసలాడడం తో సరి పుచ్చుకోసాగారు .







