తెలుగు సెన్సార్ బోర్డు తాజాగా తెలుగు సినిమాల్లో దాదాపు 30 పదాలను వాడ వద్దు అంటూ అల్టిమేటం జారీ చేసింది.బూతు పదాలంటూ వాటిని తెలుగు సెన్సార్ బోర్డు నిషేదించింది.
దాంతో తెలుగు నిర్మాతలు సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిన్న చిన్న పదాలను కూడా వాడవద్దు అంటే ఎలా అంటూ నిర్మాతలు అంటున్నారు.
కాగా సెన్సార్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు అయిన జీవిత రాజశేఖర్ సమర్తిస్తోంది.
తెలుగు సినిమాలో 30 బూతు పదాలను నిషేదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నట్లుగా జీవిత ప్రకటించారు.
కోట్లాది మంది ప్రభావింతం అయ్యే సినిమాలో అలాంటి బూతులు ఉండటం మంచిది కాదని బోర్డు నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది
.






