వైసార్ ను అభిమానించే జిల్లాల్లో తూరు గోదావరి జిల్లా ఒకటి.కాకపోతే పవన్ కళ్యాణ పుణ్యమా అంటూ పాపం వైఎస్ఆర్ పార్టీ ఆ జిల్లాలో ఒక్క సీటును కూడా గెలవలేదు…ఇక ఇదంతా పక్కన పెడితే… అదే జిల్లా అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది.
పోలీసులు తప్పుడు కేసు పెట్టారని మనస్తాపం చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నేత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అమలాపురం పట్టణానికి చెందిన వాసిశెట్టి సుభాష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువత విభాగం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
యువతలో సుభాష్‌కు వస్తున్న క్రేజ్‌ను తట్టుకోలేని అధికార పార్టీ నాయకులు సుభాష్‌పై తప్పుడు కేసులు నమోదు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం నేతలు ఆరోపించారు.దీంతో మనస్తాపానికి గురైన సుభాష్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేశారు.
స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.అయితే ఈ సంఘటనతో శోక సాంద్రంలో మునిగిపోయారు వైకాపా నేతలు…అభిమానులు.







