ప్రధాని నరేంద్ర మోడి పరిస్థితి ఒకసారిగా తలకిందులు అయ్యిపోయింది.డిల్లీ ఎన్నికలకు ముందు అంతా మోడి హవా ను పోగుడుకుంటూ బ్రతికేసారు.
అయితే ఆ తరువాత మాత్రం విమర్శిస్తూ గడిపేస్తున్నారు.విషయం ఏమిటంటే.
మోడీ, అమిత్ షా అహంకారపూరిత రాజకీయాల వల్లే ఢిల్లీలో బీజేపీకి చావుదెబ్బ తగిలిందని అంతా విమర్శిస్తున్నారు.పార్టీలో మోడీ వ్యక్తి పూజ బాగా పెరిగిందని.
మోడీ గర్వాన్ని అణిచేందుకే ఓటర్లు మూకుమ్మడిగా ఆప్ కు ఓటేశారని విశ్లేషణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో గుజరాత్ లో మోడీకి గుడి కట్టిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కతారియా గ్రామంలో భరతమాత విగ్రహం పెట్టేందుకు అనుమతి తీసుకున్న కొందరు యువకులు.ఆ స్థలంలో మోడీకి గుడి కట్టేశారు.
దాదాపు రెండు లక్షలు ఖర్చుచేసి ఆలయాన్ని నిర్మించారు.ఈ విషయం మీడియాలో బాగా హైలెట్ అయ్యింది.
అసలే ఎన్నికల ఓటమితో మోడీ పరేషాన్ లో ఉంటే.ఈ గుడి వివాదం ఆయనకు మరింతగా చిర్రెత్తించింది.
గుజరాత్ లో తనకు గుడి కట్టి పూజలు నిర్వహించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తంచేశారు.ఈ వార్త తనను దిగ్ర్భాంతికి గురిచేసిందన్న మోడీ… బతికున్నవారికి గుడి కట్టడం మన దేశ సంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.ఇందుకు వినియోగిస్తున్న సమయం, వనరులను… స్వచ్ఛభారత్ కల నెరవేరేందుకు ఉపయోగించాలని కోరారు.
మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మోడీ ఆలయాన్ని యువకులు ధ్వంసం చేశారు.ఏది ఏమైనా పాపం మోడి సాబ్ కు కొంచెం బ్యాడ్ టైమ్ నడుస్తుంది.







