అల్లు అర్జున్!! ప్రస్తుతం ఉన్న తెలుగు చిత్రం పరిశ్రమలో హీరోల్లో టాప్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్న బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ చిత్రం తరువాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అంటూ అటు అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ తీవ్ర చర్చ నెలకొన్న సంధర్భంలో ఎట్టకేలకు బన్నీ తన తరువాత సినిమా విషయాలు బయటకు వచ్చాయి.
వివారోల్ళోకి వెళితే బన్నీ త్రివిక్రమ్ సినిమా తరువాత “మిర్చి” సినిమాతో దర్శకుడిగా మారిన మాటల మాంత్రికుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం.కొరటాల బన్నీని కలిసి కధ వివరించగా ఆ కధ బన్నీకి బాగా నచ్చడంతో ఈ సినిమాకు బన్ని సైన్ చేసాడంట.
మరి ఇప్పటికే వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న బన్నీకి మిర్చితో ఘాటు రుచి చూపించిన దర్శకుడు శివ కలిస్తే ఎలా ఉంటుంది అనేది తెరపై చూడాల్సిందే.