నెలసరి ఆలస్యం(Menstrual delay) అవ్వడం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆడవారు ఎదుర్కొంటున్న సమస్య.పీరియడ్స్(periods) లేట్ అవ్వడానికి ప్రెగ్నెన్సీ (Pregnancy)మాత్రమే కారణం కాదు.
తీవ్రమైన ఒత్తిడి, శరీర బరువులో మార్పులు, హార్మోన్ల అసమతుల్యత, అధికంగా వ్యాయామం చేయడం, గర్భనిరోధక మాత్రలు మరియు ఇతర మందుల వాడకం, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు ఋతు చక్రంలో అంతరాయం కలిగించవచ్చు.దాని ఫలితంగా నెలసరి అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది.
ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే పర్వాలేదు.కానీ ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంటే చాలా టెన్షన్ పడుతుంటారు.అయితే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు బెస్ట్ సొల్యూషన్ ఒకటి ఉంది.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాగా బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు(coriander seeds), హాఫ్ టేబుల్ స్పూన్ వాము (Ajwain)వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

రోజు ఉదయం లేదా సాయంత్రం టైంలో ఈ వాటర్ ను తీసుకోవాలి.నిత్యం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య దూరం అవుతుంది.నెలసరి టైమ్ టు టైమ్ వస్తుంది.అలాగే ఈ డ్రింక్ నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది.

ఇక ఈ డ్రింక్ ను తీసుకోవడంతో పాటు ఒత్తిడికి దూరంగా ఉండండి.రోజుకు పదినిమిషాల పాటు మెడిటేషన్ చేయండి.డైట్ లో గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోండి.ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండే పాలకూర, బీన్స్, బీట్‌రూట్, గుడ్లు, గోధుమ, జొన్నలను ఎక్కువగా తినండి.
ఈ ఫుడ్స్ హార్మోన్ బ్యాలెన్స్ లో సహాయపడతాయి.హార్మోన్లను డిస్టర్బ్ చేసే జంక్ ఫుడ్, అధిక షుగర్, కాఫీని ఎవైడ్ చేయండి.శరీర బరువును కంట్రోల్‌లో ఉంచుకోండి.కండి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.
తద్వారా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను క్రమంగా రెగ్యులర్ అవుతాయి.







