ఢిల్లీలో(Delhi)ఉద్యోగం చేస్తున్న ఓ యువతి తన జీవితంపై చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.భారతదేశ రాజధానిలో పనిచేసే మహిళగా తన అనుభవాలను, యూరోపియన్(European) దేశంలో పనిచేసే తన సహోద్యోగి జీవితంతో పోల్చి మరీ చెప్పింది.
ఇద్దరికీ 28 ఏళ్లే.ఉద్యోగాలు కూడా ఒకటే.
ఇద్దరూ రోజూ ఒకటిన్నర గంటలు ప్రయాణం చేస్తారు.కానీ వాళ్ల ప్రయాణ అనుభవాలు మాత్రం ఆకాశానికీ భూమికీ ఉన్నంత తేడా ఉంటుంది.
ఆ యూరోపియన్ (European) దేశంలో ఉండే అమ్మాయికి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది, అందులో రిజర్వ్ సీటు కూడా ఉంటుంది.ట్రైన్ జర్నీ ఎంత కంఫర్ట్ గా ఉంటుందంటే, ఆఫీస్ పని కూడా ట్రైన్ లోనే స్టార్ట్ చేసేయొచ్చు.
కానీ మన ఢిల్లీ అమ్మాయి పరిస్థితి వేరు.ట్రైన్ ఎక్కాలంటే రెండుసార్లు మారాలి.
సీటు ఉంటుందనే గ్యారెంటీ లేదు.ఇక ప్రయాణం నరకమే.
ఇద్దరూ ఆఫీస్‌కు దూరంగా ఉండటానికి కారణాలు కూడా వేరువేరు.యూరోపియన్ అమ్మాయి ప్రశాంతమైన ప్రదేశంలో ఉండాలని అలా దూరంగా ఉంటోంది.కానీ మన ఢిల్లీ అమ్మాయికి వేరే దారి లేదు.సేమ్ జాబ్ పొజిషన్ లో ఉన్నా కూడా తల్లిదండ్రులతో కలిసి ఉండాల్సి వస్తోంది.
వేరుగా ఉండాలంటే అద్దెలు చుక్కలనంటుతున్నాయి.భద్రత విషయంలో కూడా ఇద్దరి జీవితాల్లో చాలా తేడా ఉంది.
ఒకరోజు యూరోపియన్ అమ్మాయి ఆఫీస్ నుండి కాస్త ముందుగానే ఇంటికి వెళ్లిపోయింది.కారణం ఏంటంటే, ఇంటి నుంచి పనిచేసుకుంటే ఇంకా బాగా ఫోకస్ చేయొచ్చని ఆమె అనుకుంది.
మరి మన ఢిల్లీ అమ్మాయి, ఆమె కూడా అదే రోజు ఆఫీస్ నుండి తొందరగా బయలుదేరింది.కానీ కారణం వేరు.
ఢిల్లీలో హోలీ పండుగ (Holi festival in Delhi)సందర్భంగా రోడ్లన్నీ అమ్మాయిలకు అస్సలు సేఫ్ గా ఉండవు.అందుకే భయం భయంగా ఇంటికి పరుగు తీసింది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.కొందరు ఆమెకు మద్దతు తెలుపగా.మరికొందరు మాత్రం ఇండియాను తక్కువ చేసి చూపిస్తోందని విమర్శించారు.దీనిపై ఆ అమ్మాయి క్లారిటీ ఇచ్చింది.“నేను వెస్ట్ ను గొప్పగా చూపించాలనో.ఇండియాను విమర్శించాలనో ఈ పోస్ట్ పెట్టలేదు.
ఢిల్లీలో లక్షలాది మంది అమ్మాయిలు ఎదుర్కొంటున్న నిజ జీవితాన్ని షేర్ చేసుకున్నా అంతే” అని చెప్పింది.
ఆమె చెప్పిన పాయింట్స్ చాలా మందికి కనెక్ట్ అయ్యాయి.“ఒకే వయసు, ఒకే జాబ్.కానీ జీవితాలు మాత్రం ఎంత తేడాగా ఉన్నాయి.
ఆమె ప్రశాంతంగా ఉండగలుగుతోంది.నువ్వేమో భద్రత, డబ్బు సమస్యలతో పోరాడుతున్నావు” అని ఒకరు కామెంట్ చేశారు.ముంబైకి చెందిన మరొకరు కూడా ఆమె బాధను అర్థం చేసుకున్నారు.“న్యూయార్క్ లో ఉండే నా టీమ్ మేట్స్ లైఫ్ స్టైల్ చూస్తే నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది.మా జీవితాలు ఒకేలా ఉన్నా.ఎంత తేడా” అని అన్నారు.ఇంకొక నెటిజన్ అయితే మరికొన్ని తేడాలు కూడా యాడ్ చేశారు.“ఆమె స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటుంది.వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవిస్తుంది.పైగా ఇండియాలో ఉన్న జీతం కంటే ఎక్కువే సంపాదిస్తుంది.ఇక్కడ జెండర్ పే గ్యాప్ కూడా ఎక్కువ కదా” అంటూ కామెంట్ పెట్టారు.

గుర్గావ్ లో మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి జర్మనీలో జాబ్ చేస్తున్న ఓ మహిళ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది.“ఒకప్పుడు రాత్రి 9 గంటలకు బస్టాప్ నుంచి ఇంటికి వెళ్లాలంటే ఎంత భయపడేదాన్నో.కానీ ఇప్పుడలా కాదు.
జర్మనీలో బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే, నా జీవితంలో మొదటిసారి భయం లేకుండా ఉన్న ఫీలింగ్ కలిగింది.ఆ భద్రత, స్వేచ్ఛ వెలకట్టలేనివి” అని ఆమె ఎమోషనల్ గా రాసుకొచ్చారు.
మొత్తానికి ఈ పోస్ట్ ఇండియాలో పనిచేసే అమ్మాయిలు ఎదుర్కొంటున్న భద్రత, ఆర్థిక ఇబ్బందులు, సమానత్వం లాంటి విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో ఈ పోస్ట్ కళ్ళకు కట్టినట్టు చూపించింది.







