యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల మాజీ సర్పంచులను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కావడంతో అడ్డుకుంటారనే నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు వారిని అరెస్టు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.
ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
కనీసం నిరసన తెలుపడానికి కూడా అవకాశం లేకుండా అరెస్టులు చేయడం దారుణమని వాపోయారు.







