యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (young tiger junior ntr)ఎంత ప్రతిభ ఉన్న నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.ఎన్టీఆర్ (NTR)నటించి తాజాగా రిలీజైన జెప్టో యాడ్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది.
ఈ యాడ్ బాగానే ఉన్నా తారక్ లుక్స్ విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి.అయితే ఆ విమర్శలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేలా తారక్ న్యూ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక్క ఫోటోతో తారక్ విమర్శలకు చెక్ పెట్టడం గమనార్హం.తారక్ స్లిమ్ లుక్ చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యపోతున్నారు.స్లిమ్ లుక్ లో తారక్ సింప్లీ సూపర్బ్ అనేలా ఉన్నారు.రాబోయే రోజుల్లో కూడా తారక్ లుక్స్ (Tarak’s looks)విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.
తారక్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 60 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాలు కమర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తాయో చూడాలి.దేవర సినిమా ఫుల్ రన్ లో 550 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం నెట్టింట ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.

2025 సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ కు లక్కీ ఇయర్ కావాలని వరుసగా ఎనిమిదో హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అదే సమయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజీ డైరెక్టర్ల డైరెక్షన్ లో భవిష్యత్తు సినిమాలను ప్లాన్ చేసుకున్నారు.







