సినిమా ఇండస్ట్రీలో సందీప్ కిషన్ కి( Sundeep Kishan ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.ఇక ఆయన చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తూ ఉంటాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే గత కొన్ని రోజుల నుంచి ఆయన ఫ్లాపుల్లో ఉన్నాడు. ‘ఊరి పేరు భైరవకోన’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ సక్సెస్ ని మాత్రం కాపాడుకోడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈరోజు ‘మజాకా’( Mazaka Movie ) అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించిందా అంటే లేదనే చెప్పాలి.
రొటీన్ రొట్ట ఫార్ములాలో సాగిన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులందరూ సినిమా చాలా రొటీన్ గా ఉందని సినిమాలో అసలు మ్యాటర్ లేదంటూ చాలావరకు కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని భారీ రేంజ్ లో ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం ప్లాపులను అందుకొని ఇప్పుడిప్పుడే మంచి విజయాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో అప్పుడెప్పుడో ఇండస్ట్రీకి వచ్చిన సందీప్ కిషన్ మాత్రం అడపాదడపా సక్సెస్ లను సాధిస్తూ ఎప్పుడు ఫ్లాపుల్లోనే ఉంటున్నాడు.కాబట్టి ఈ సినిమా మాత్రం ఆయన కెరియర్ కి ఎలాంటి ఉపయోగాన్ని కల్గించబోదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.చూడాలి మరి ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…

ఇక ఇదిలా ఉంటే తన తోటి హీరోలు వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే ఆయన మాత్రం సక్సెస్ ని సాధించడానికి నాన్న తంటలు పడుతున్నాడు.కారణం ఏంటి అనే విషయమైతే ఎవరికి అర్థం కావడం లేదు.ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ లోనే చాలా వరకు మిస్టేక్స్ చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
.







