ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలి

రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సన్నద్దత పై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా :ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సన్నద్దత పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 Necessary Facilities Should Be Provided At Grain Buying Centres , Grain Buying C-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మొత్తం వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, టార్ఫాలిన్ కవర్లు మరోసారి వినియోగించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని, మనకు అవసరమైన వసతుల ఇండెంట్ పక్కగా నమోదు చేయాలని అన్నారు.టార్ఫాలిన్ కవర్లు, గని బ్యాగులు వేయింగ్ యంత్రాలు, తేమ శాతం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు వినియోగించుకునేందుకు వీలుగా ఎంత మన దగ్గర అందుబాటులో ఎన్ని ఉన్నాయో నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

యాసంగి కోతలకు ముందే హర్వెస్టర్లతో సమావేశం నిర్వహించి సమగ్ర కోతల ప్రణాళిక తయారు చేయాలని అన్నారు.హార్వెస్టర్లు అవసరమైన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

దాన్యం కేంద్రముల వద్ద అవసరమైన అన్ని వసతులు పకడ్బందీగా ఉండేలా కార్యాచరణ తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో ఉన్న మిల్లర్ల బిల్డింగ్ కెపాసిటీ పెంచాలని, మిల్లింగ్ సామర్థ్యం మేరకు జరగాలని , నిర్దేశిత సమయంలో భారత ఆహార సంస్థకు సరఫరా పూర్తి చేయాలని, ప్రతిరోజు కనీసం 16 గంటల వరకు మిల్లింగ్ జరిగేలా చూడాలని అన్నారు.

రైస్ మిల్లుల వద్ద ఉన్న స్టాక్ ను తనిఖీ చేయాలని, అక్రమ దాన్యం రవాణాను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతి రైస్ మిల్లర్ బ్యాంక్ గ్యారెంటీ సమర్పించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.2022-23 రబీ రైస్ వేలం వేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.ఖరీఫ్ 2023-24 సిఎంఆర్ ఎస్ డెలివరీ పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, డి.ఎం.సివిల్ సప్లై అధికారులు రజిత, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube