రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గొల్లపెల్లి గ్రామానికి చెందిన పాశం ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుపుకున్నాడు.పుట్టినరోజు అనగానే కేకులు కటింగ్ చేసి, పటాకులు పేలుస్తూ, మద్యం తాగుతూ రోడ్డు మీద ఆకతాయిలవల్లే తిరుగుతుంటారు.
కానీ పాశం ప్రశాంత్ మాత్రం దానికి విరుద్ధంగా అంగన్వాడి కేంద్రాల్లో, ప్రాథమిక పాఠశాలలో, జిల్లా పరిషత్ హై స్కూల్లో పండ్ల పంపిణీ చేసి యువతకు ఒక సందేశం అందించాడు.ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ నా పుట్టినరోజుని పిల్లలతో కలిసి గడపాలనుకున్నాను అందుకే అంగన్వాడి కేంద్రాల్లో, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుపుకున్నాను అని అన్నారు.
పాశం ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలు తెలుసుకున్న గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అతని వెంట మిత్రులు చీకట్ల సత్తిష్,పుట్టి రాజు,పాశం హరీష్,గడ్డమీది సాయి చంద్,కొర్రి ప్రణయ్, బండి భరత్,కార్యం సురేష్, బండి ఉదయ్, అంబేద్కర్ ఆదర్శ యూత్ శాతవాహన కాలిని సభ్యులు పాల్గొన్నారు.







