రిషబ్ శెట్టి( Rishab Shetty ) హీరోగా తెరకెక్కిన కాంతార మూవీ( Kantara ) బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార1 తెరకెక్కుతుండగా ఒక యువకుడిపై కాంతార టీమ్ దాడి చేసిందంటూ స్థానికులు పోలీసులను ఆశ్రయించడం సంచలనం అయింది.
పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారీ షాక్ తగలడం రిషబ్ శెట్టి ఫ్యాన్స్ ను సైతం బాధ పెడుతోంది.
అయితే నిబంధనలు పాటించని పక్షంలో కాంతార మూవీ షూటింగ్ ను నిలిపివేస్తామని కర్ణాటక రాష్ట్ర మంత్రి కాంతార మేకర్స్ కు హెచ్చరికలు జారీ చేశారు.
నిబంధనలు పాటించని పక్షంలో షూటింగ్ ను నిలిపివేస్తామని కర్ణాటక మేకర్స్ చెబుతున్నారు.కాంతార టీమ్ అడవులు, వన్యప్రాణులకు తీవ్రస్థాయిలో నష్టం కలిగించిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ప్రస్తుతం గవిగడ్డ అటవీ శ్రేణిలో కాంతార మూవీ షూట్( Kantara Movie Shooting ) జరుగుతోంది.ఈ ఏడాది అక్టోబర్ నెల 2వ తేదీన గాంధీ జయంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.కాంతార1 కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.కాంతార2( Kantara 2 ) సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
కాంతార2 మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా సంచలనాలు సృష్టించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.కాంతార2 సినిమా కాంతార1 స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.కాంతార2 సినిమాకు రిషబ్ శెట్టి పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.