తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో... మా ప్రేమ పెరుగుతోంది అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.ఇలా పెళ్లి చేసుకున్న వారిలో నటుడు కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు.

 Actor Kiran Abbavaram Share His Wife Rahasya Baby Bump Photos Details, Kiran Abb-TeluguStop.com

గత ఏడాది ఆగస్టు నెలలో కూర్గ్ సమీపంలో ఈ హీరో నటి రహస్య( Rahasya ) ను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా వివాహం తర్వాత ఈ జంట ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.

ఇక ఈ ఇద్దరు రాజావారు రాణి గారు అనే సినిమాలో నటించి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Telugu Kiran Abbavaram, Kiranabbavaram, Rahasya-Movie

ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు చాలా ఆలస్యంగా వెల్లడించారు.ఇలా ఐదు సంవత్సరాలు పాటు రహస్యంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడమే కాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇక వివాహం తరువాత రహస్య సినిమాలకు దూరంగా ఉంటూ సాధారణ గృహిణిల తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

Telugu Kiran Abbavaram, Kiranabbavaram, Rahasya-Movie

ఇక పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం క అనే సినిమా( Ka Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.అయితే అభిమానులకు తాజాగా ఈయన మరొక శుభవార్తను కూడా తెలియజేశారు.తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం తన భార్య బేబీ బంప్( Rahasya Baby Bump ) కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టారు.

ఇలా తన భార్య బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన ఈయన మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది అంటూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.ఇలా రహస్య తల్లి కాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube