తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను సాధిస్తూ దాదాపు 50 సంవత్సరాలుగా ఇండస్ట్రి ని ఏలుతున్న ఒకే ఒక్క హీరో చిరంజీవి…( Chiranjeevi ) ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకు మెగాస్టార్ గా ఉన్న బిరుదును రెట్టింపు చేసే విధంగా క్రేజీనైతే సంపాదించుకుంటున్నాడు.ఇక ఇప్పుడు విశ్వంభర సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోడానికి రెడీ అవుతున్న ఈ స్టార్ హీరో తన తదుపరి సినిమాలతో ఎలాంటి ప్రభంజనాలను సృష్టిస్తాడనేది తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇకమీదట చేయబోయే సినిమాలతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో చేయబోయే సినిమా మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇక ఈ విశ్వంభర సినిమా( Vishwambhara Movie ) షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూపించడానికి అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక ఇంతకు ముందు చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా సమయంలో ఎలా ఉండేవాడో అలాంటి చిరంజీవి ని చూపించే ప్రయత్నాలైతే చేస్తున్నాడు.
మరి దానికి అనుగుణంగానే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన మీరాజాస్మిన్( Meera Jasmine ) నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం మీద అనిల్ రావిపూడి స్పందిస్తే తప్ప సరైన క్లారిటీ అయితే రాదు…
.