ప్రాణాపాయం ఎప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో గురవుతామో ఊహించలేం.కొన్ని ప్రమాదాలు అనూహ్యంగా చోటుచేసుకొని, చూసేవారిని కలచివేస్తుంటాయి.
అలాంటి ఘోర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కర్ణాటకలోని కలబురగిలో (Kalaburagi, Karnataka)జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది.
లబురగిలోని స్థానిక మోహన్ లాడ్జి వద్ద భాగ్యశ్రీ (Bhagyashree)అనే మహిళ తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లింది.అలా వెళ్లిన ఆమె బస్సు ఆగగానే, కొడుకును బస్సులోకి ఎక్కించే క్రమంలో ఊహించని విధంగా విద్యుత్ లైన్లు తెగి బస్సు మీద పడ్డాయి.
విద్యుత్ లైన్లు పడ్డ వెంటనే, భాగ్యశ్రీ విద్యుదాఘాతానికి గురై కిందపడి పోయింది.ఈ ఘటనలో ఆమె కొడుకు కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.తల్లీకొడుకులు విద్యుత్ ప్రవాహంలో కొట్టుకుంటుండగా, అక్కడి ప్రజలు అలా చూస్తుండిపోయి ఏమి చేయలేకపోయారు.వారిని రక్షించేందుకు చాలామంది ప్రయత్నించినప్పటికీ, విద్యుత్ లైన్ల కారణంగా ఎవరూ దగ్గరికి వెళ్లలేకపోయారు.
ఇక చాలా సేపటి తర్వాత, ఎలాగోలా తల్లీకొడుకులను విద్యుత్ లైన్ల నుంచి బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు అక్కడి స్థానికులు.ఈ ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.అయితే, స్కూల్ బస్సులో ఉన్న 11 మంది పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.”అయ్యో.ఎంత ఘోరం జరిగింది” అని కొందరు విచారం వ్యక్తం చేస్తుండగా.మరికందరు ”విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కామెంట్ చేస్తున్నారు.నిజానికి ఈ ఘటన అందరికీ గుణపాఠం.విద్యుత్ లైన్ల నిర్వహణపై మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన నిరూపిస్తుంది.
ప్రజల భద్రతకోసం విద్యుత్ శాఖ మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం ఇది.మొత్తానికి, భాగ్యశ్రీ కుటుంబం ఇప్పుడు ప్రమాదం నుంచి కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.ఇటువంటి ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవడం చాలా అవసరం.