పునర్జన్మ ఉందా? యూఎస్ మేధావి సంచలన వ్యాఖ్యలు!

ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి ఎవరో తెలుసా? ఐన్‌స్టీన్ అనుకుంటున్నారా? కానే కాదు! క్రిస్ లాంగన్( Chris Langan ) అనే అమెరికా రాంచర్ (పశువుల కాపరి), ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే ఎక్కువ IQ (190-210 మధ్య) కలిగి ఉన్నాడని చెబుతారు.ఈయన ఒక సంచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, అదే కాగ్నిటివ్-థియరెటిక్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్.

 What Happens After Death Worlds Smartest Man Christopher Langan Answers Details,-TeluguStop.com

ఈ సిద్ధాంతం ప్రకారం, మనమంతా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో భాగం లాంటివాళ్లం! అంటే, మనమంతా ఒక వీడియో గేమ్ లేదా ఒక డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం.

Telugu Afterlife, American, Chris Langan, Consciousness, Existence, Iq, Mortalit

ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, లాంగన్ ఈ CTMU సిద్ధాంతాన్ని ఉపయోగించి దేవుడు, ఆత్మ, మరణానంతర జీవితం( Afterlife ) ఉన్నట్లు నిరూపించవచ్చని వాదిస్తున్నాడు.అంటే, మనం చనిపోవడం అంటే గేమ్ ఓవర్ అవ్వడం కాదు, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్‌కి మారడం లాంటిది.మరణం అనేది కేవలం ఒక ప్రోగ్రామ్ నుండి మరొక ప్రోగ్రామ్‌కు మారడమేనని ఆయన భావన.ఈ సిద్ధాంతం వినడానికి చాలా ఆసక్తికరంగా, కొంచెం వింతగా కూడా ఉంది కదా,

Telugu Afterlife, American, Chris Langan, Consciousness, Existence, Iq, Mortalit

ఆయన ప్రకారం, చావు( Death ) అంటే కథ కంచికి చేరడం కాదు, ఇది ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్‌కి మారడం లాంటిది.మన జీవితాన్ని ఒక “సెల్ఫ్-ప్రాసెసింగ్ లాంగ్వేజ్”తో పోల్చుతాడు.మనం చనిపోయినప్పుడు, ఈ శరీరాన్ని వదిలేసి, వాస్తవిక మూలానికి చేరుకుంటాం.అంటే, ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే తిరిగి వెళ్తాం.అక్కడ మనకు ఒక కొత్త “బాడీ” రావచ్చు, అది వేరే విధంగా జీవించడానికి ఉపయోగపడుతుంది.గత జన్మల జ్ఞాపకాలు ఉండకపోవచ్చు.

కావాలంటే గుర్తు తెచ్చుకోవచ్చు, కానీ సాధారణంగా అవసరం ఉండదు.ఇది ఒక ధ్యాన స్థితి లాంటిది.

మన పూర్వ జన్మలన్నీ, ఒకవేళ పునర్జన్మ( Reincarnation ) ఉంటే, ఒకే సమయంలో వేరే లోకంలో జరుగుతాయని లాంగన్ చెబుతాడు.అంటే, మన గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి అక్కడ ఉంటాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube