జలుబు రెండే రెండు రోజుల్లో పరార్ అవ్వాలంటే ఇలా చేయండి!

ప్రస్తుత చలికాలంలో( Winter ) అత్యంత సర్వ సాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో జలుబు అనేది ముందు వరుసలో ఉంటుంది.ఇంట్లో ఒకరికి జలుబు చేసిందంటే ఆటోమేటిక్ గా మిగతా వారికి కూడా అంటుకుంటుంది.

 Do This To Get Rid Of The Cold In Two Days Details, Cold, Cold Relief Drink, Lat-TeluguStop.com

పైగా ఈ కాలంలో జలుబు ఓ పట్టాన పోదు.ఇది చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.

ఒక్కోసారి జలుబు( Cold ) కారణంగా జ్వరం కూడా వస్తుంటుంది.అయితే జలుబును తరిమికొట్టే ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయి.

జలుబు రెండే రెండు రోజుల్లో ప‌రార్ అవ్వాలంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను తప్పకుండా ప్రయత్నించండి.

అందుకోసం ముందుగా రెండు తమలపాకులు( Betel Leaf ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న తమలపాకులు, పావు టీ స్పూన్ పసుపు,( Turmeric ) పావు టీ స్పూన్‌ మిరియాలు పొడి( Black Pepper ) వేసి దాదాపు పది నిమిషాల పాటు మరిగించండి.

ఆ తరువాత వన్ టీ స్పూన్ నల్ల బెల్లం పొడి( Black Jaggery Powder ) వేసి మరొక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Telugu Betel Leaf Tea, Betelleaf, Betel, Blackjaggery, Black Pepper, Tips, Lates

ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాట‌ర్ ను ఫిల్టర్ చేసుకుని సేవించడమే.ఈ తమలపాకుల టీ ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా జలుబు చేసినప్పుడు రోజుకు ఒకసారి ఈ టీ ను కనుక తీసుకుంటే కేవలం రెండు రోజుల్లోనే జలుబు దూరమవుతుంది.

దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు, క‌ఫం వంటి సమస్యలు ఉన్నా కూడా దూరం అవుతాయి.

Telugu Betel Leaf Tea, Betelleaf, Betel, Blackjaggery, Black Pepper, Tips, Lates

అలాగే ఈ త‌మ‌ల‌పాకుల టీ శరీరంలో ఉన్న హానికరమైన టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది.తమలపాకు లో ఉండే యాంటీ-వైరల్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.అంతేకాకుండా ఈ త‌మ‌ల‌పాకుల టీ జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube